పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మానవ మనుగడ ప్రశాంతంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తు కుండా జీవించగలుగుతామని కావున ప్రతి పౌరుడు మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని గాలి , నీరు, చెట్టు లను కాపాడుకోవటం మన బాధ్యతని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకొని తప్పనిసరిగా మన చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాలలో, అలాగే వాకింగ్ ట్రాకల్లో రోడ్లు వెంపటి నెలకు ఒక చెట్టు అయినా నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులు పరిశె ఆదిశేషు మరియు కోరిటిపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నసాని బాజీ అన్నారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా గుంటూరు కోరిటిపాడు వాకింగ్ ట్రాక్ లో రోటరీ క్లబ్ గుంటూరు వికాస్ సౌజన్యంతో మొక్కలు నాటే కార్యక్రమన్ని చేపట్టటం జరిగింది . ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికుడు రత్తయ్య , రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ సభ్యలు సుధీర్ బాబు, ప్రేమకుమార్, చిన్నయ్య
సతీష్ బాబు డా. శిరీష ,, సత్యన్నారాయణ , శ్రీనివాసమణి
,వెంకటేశ్వరరావు, పి వి అప్పారావు, సాయి రాజు మరియు వాకింగ్ ట్రాక్ కమిటీ సభ్యలు తదితరులు పాల్గొన్నారు