ఆంధ్రప్రదేశ్

BREAKING NEWS – CENTRAL MINISTER PEMMASANI STATMENT: గుంటూరు జిల్లాలో వేగంగా ఫ్లై ఓవర్లు నిర్మాణం

DEVELOPMENT PROGRAM

మూడున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం. పక్కా ప్రణాళికతో గుంటూరులో వంతెనలు పూర్తి. నిర్మాణానికి రూ 41 కోట్లు కేటాయింపు. పెదపలకలూరు ఎల్ సి. నెం. 6కు మంజూరుపై పెమ్మసాని ప్రకటన చేశారు. మొదటి ఏడాదిలోపు వంతెనల మంజూరు, రెండున్నర ఏళ్లలో నిర్మాణాల ఎగ్జిక్యూషన్, మూడున్నర ఏళ్ల లోపు నిర్మాణాలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో పని చేస్తున్నాం.’ అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెదపలకలూరు ఎల్సీ నెంబర్ – 6 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ఢిల్లీలోని ఆయన తన కార్యాలయంలో విలేకరులతో సోమవారం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికలు రచించామన్నారు. గుంటూరు జిల్లా వాసుల మూడు దశాబ్దాల కలగా ఉన్న శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ ఆర్ఓబి నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. ఇదే క్రమంలో గుంటూరు నల్లపాడు సెక్షన్ లోని పెదపలకలూరు (పుల్లడిగుంట – పేరేచర్ల రోడ్డు) LC.No: 6ను రైల్వే శాఖ ద్వారా మంజూరు చేయించుకున్నామని, ఈ నిర్మాణానికి గాను రూ 41 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. ఇప్పటిదాకా మంజూరైన ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. సత్తెనపల్లి, నరసరావు పేట మీదుగా మాచర్ల, హైదారాబాద్ వెళ్లే వారికి ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. వ్యవసాయోత్పత్తులకు, రైతాంగానికి, పలు ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఈ ఆర్ఓబి నిర్మాణం కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, సోమన్న లకు ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలియజేశారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker