అమరావతి: డిసెంబర్ 9:-రాష్ట్రంలో రెవెన్యూ సేవలను పూర్తిగా పారదర్శకంగా, మరింత సులభతరంగా మార్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు సహా భూ సంబంధించిన అన్ని సేవల్లో రియల్‌టైమ్ ఆటో మ్యుటేషన్ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యగానే ఆటో మ్యుటేషన్ అమలయ్యే విధంగా సాఫ్ట్‌వేర్ నిర్మాణాన్ని రూపొందించాలని సూచించారు.భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రానివ్వకూడదని, రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై తాను ప్రతీ నెలా సమీక్షిస్తానని చెప్పారు.సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. పీజీఆర్ఎస్‌లో మ్యుటేషన్, పాస్‌బుక్‌లకు సంబంధించి వచ్చిన 1,97,915 ఫిర్యాదుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్, రీసర్వే భూ తగ్గింపు, జాయింట్ ఎల్‌పీఎంలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదైనట్టు తెలిపారు.
రిసర్వే నెలనెలా పర్యవేక్షణ – 2027 డిసెంబర్ డెడ్‌లైన్అధికారుల వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా, ఇంకా 10,123 గ్రామాలు పెండింగ్ ఉన్నాయి. అయినప్పటికీ 2027 డిసెంబర్ నాటికి ఏ పరిస్థితుల్లోనూ రీసర్వే పూర్తి చేయాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి నెలా పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.జాయింట్ ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్‌కు సంబంధించిన వివాదాలు త్వరగా పరిష్కరించాల్సిందిగా, భూముల డేటాబేస్‌ను పూర్తిగా ఆన్‌లైన్ చేయడం ద్వారా ఈసీ జారీ ప్రక్రియ మరింత సులభం అవుతుందని తెలిపారు. అలాగే:22-ఏ జాబితా నుంచే తొలగించాలని వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి22ఏ ఫ్రీహోల్డ్ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలిడాక్యుమెంట్ల ట్యాంపరింగ్ నివారణకు బ్లాక్‌చెయిన్ వంటి పటిష్ట వ్యవస్థ అవసరంవివాదాస్పద భూములపై నిర్ణయాధికారం ఇకపై ఆర్డీవోలకు ఇవ్వాలని నిర్ణయంచుక్కల భూములను, అలాగే 1999 వరకు ప్రాథమిక సహకార సంఘాల వద్ద తాకట్టు ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు1954 కంటే ముందు ఉన్న బంజరు భూముల సేల్ డీడ్స్‌ను కూడా 22ఏ నుంచి తొలగించాలని సూచించారు
రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యంమున్సిపల్ పరిధిలోని అసైన్డ్ భూములను మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు 250 గజాల వరకు ఉన్న స్థలాలను బేస్ విలువలో 50% తో రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఆక్వా కల్చర్ చేస్తున్న అసైన్డ్ భూములను సబ్‌రిజిస్ట్రార్ విలువల ఆధారంగా రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.అలాగే:10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం తక్షణం ఇవ్వాలిఆర్టీజీఎస్‌తో అనుసంధానించి ఆదాయ ధృవపత్రాలును జారీ చేయాలిస్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా నిర్ణయించారుమార్కెట్ విలువలతో పాటు భూమి విలువలను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం ఆదేశించారు
రెవెన్యూ శాఖలో 86% గ్రీవెన్సులు పరిష్కారంగత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు రెవెన్యూ శాఖకు మొత్తం 5,28,217 ఫిర్యాదులు రాగా, వాటిలో 4,55,189 (86%) పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. మరో 73 వేల ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా అసంతృప్తి ఉంటే ఆ ఫైళ్లను తిరిగి ఓపెన్ చేసి పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి భూములు తొలగించాలని 6,846 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. అందులో ఎక్స్‌సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారి భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.