
విజయవాడ :14-11-25:- జాతీయ, రాష్ట్రస్థాయి ఎన్నికలపై తమ అంచనాలు మరోసారి నిజమయ్యాయని స్మార్ట్ పోల్స్ సంస్థ ప్రతినిధి నూకల శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తమ సంస్థ ముందుగానే వెల్లడించిందని, అదే విధంగా ఫలితాలు వెలువడ్డాయని తెలిపారు. మూడు దశాబ్దాలుగా విజయవాడను కేంద్రంగా చేసుకుని రాజకీయ సర్వేలు నిర్వహిస్తున్నామని, అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలలో ఎక్కువ శాతం ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని శ్రీనివాసరావు గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఢిల్లీలో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేసినట్టు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలను స్మార్ట్ పోల్స్ ముందే గుర్తించినట్లు పేర్కొన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు, బీహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం—ఈ రెండూ తమ సర్వేల ఖచ్చితత్వానికి నిదర్శనాలని అన్నారు.సమావేశానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ అడ్డూరి శ్రీరామ్, స్మార్ట్ పోల్స్ ప్రతినిధులను అభినందిస్తూ, సంస్థ భవిష్యత్తులో మరిన్ని శ్రేష్ఠమైన సర్వేలు చేసి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నూకల నాగేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.







