
పల్నాడు:21-10-25:-రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న చర్యగా పల్నాడు జిల్లా పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది.

జాతీయ రహదారులపై గుర్తించిన “బ్లాక్ స్పాట్స్” వద్ద పోలీసులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లను ఆపి, వారికి నీళ్లతో ముఖం కడగమని సూచిస్తూ మళ్లీ ప్రయాణానికి పంపుతున్నారు. దీని ద్వారా డ్రైవర్లు మెలకువగా ఉండి, నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, “వాహనం నడుపుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోండి” అని సూచించారుదాచేపల్లి, నాగార్జునసాగర్, నరసరావుపేట, శావల్యపురం, మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసులు రోజువారీగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమంతో పాటు వాహనాల తనిఖీలు, విజిబుల్ పట్రోలింగ్ కొనసాగిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు







