భోగి, మరియు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ వేడుకలను ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. తొలుత సాంప్రదాయ పద్ధతిలో ఎద్దుల బండిలో సంక్రాంతి పండుగ వేషధారణలో పంచ కట్టి క్రీడా మైదానంలోకి ప్రవేశించారు. అనంతరం క్రీడా మైదానంలో ఉన్నటువంటి బిజెపి నాయకులను కార్యకర్తలను అధికారులను మాట్లాడి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి భోగిమంటలను ప్రారంభించారు. భోగి మంటల నడుమ మహిళలు తమ పాటలతో అందరినీ డు డు బసవన్న ప్రదర్శన కూడా అందర్నీ ఆకర్షించే విధంగా జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక్కం మధుసూదన్ రెడ్డి, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, కూటమి ప్రభుత్వ పార్టీ నాయకులుపట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
130 Less than a minute