
ఏలూరు నగరంలో సినిమా హీరోయిన్ అనన్య నాగళ్ళ శ్రీరామ్ నగర్ లోని దేవి పెయింట్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎం శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఆసియన్ పెయింట్స్ నిర్వహించిన సెలక్షన్స్ లో తమ షో రూమ్ కు స్పందన లభించడంతో అందులో భాగంగా ఆసియన్ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ కుమారి అనన్య షోరూం కి విచ్చేసి అభినందనలు తెలిపారని అన్నారు. ఏలూరులోని శ్రీ రామ్ నగర్ తో పాటు సత్రంపాడు, చాటపర్రు ,కైకలూరు తదితర గ్రామాల్లో షోరూంలు ఏర్పాటు చేశామని ముందు ముందు మరికొన్ని షోరూమ్ లు ఏర్పాటు చేసేందుకు కృతనిత్యంతో ఉన్నామని నిర్వాహకులు శ్యామ్ కుమార్ తెలిపారు.







