
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం 8 వ రోజు స్థానిక 4 వ డివిజన్ మస్తాన్ మాన్య కాలనీ లో పండగ వాతావరణం లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా బడేటి రాధాకృష్ణ కి డివిజన్ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరణలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు .ఎటువంటి సమస్యలు వచ్చినా తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చెప్పిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ పార్ధ సారధి, ఇడా చైర్మన్ శివప్రసాద్ , టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం,నాలుగో డివిజన్ ఇంచార్జ్ లాలాలిజపతిరాయ్, నాలుగో డివిజన్ ప్రెసిడెంట్ జిలానీ, ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు







