రహదారుల పైకి పశువులను వదిలి రహదారి ప్రమాదాలకు కారణమవుతున్న పశువుల యజమానులపై కొరడా జూలిపించేందుకు కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమయింది. ఈమధ్య అధికంగా రహదారి ప్రమాదాలు రోడ్లపై పశువులు అడ్డుగా రావడం వలన జరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో కోన గ్రామానికి చెందిన కోమటి రంగయ్య అనే వ్యక్తి కోన నుండి పల్లె తుమ్మలపాలెం వెళ్లే క్రమంలో మధ్యలో ఉన్న వంతెన దాటుతూ ఉండగా రోడ్డుపై ఉన్న గేదెను గమనించక గుద్దడంతో ప్రమాదం సంభవించింది. చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడు.ఈ ప్రమాదానికి కారణమైన గేద యజమానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇకపై ఎవరైనా రహదారుల పైకి పశువులను వదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాక, వారినే పూర్తి బాధ్యులుగా చేసి చట్ట ప్రకారం శిక్షపడేలా చేయడంలో వెనకాడేది లేదని, కనుక మీ యొక్క పశువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలే గాని రహదారుల పైకి వదలవద్దని హెచ్చరికలు జారీ చేయడమైనది.
227 Less than a minute