ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM..జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి
ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ 1-19 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను మింగించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహబూబ్ సుభాని పాల్గొన్నారు.