
పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం గురుజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 12 13 నెలలో ఉమ్మడి టిడిపి ప్రభుత్వ పాలన సరిగా లేదని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చక పోవడంలో విఫలమయ్యారని అన్నారు.
బంగారుపాళ్యం మార్కెట్ యార్డు కు పలమనేరు నియోజకవర్గం నుండి రైతులు రాకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. మామిడి రైతులు రాకుండా బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ యార్డు లో 116 దుకాణాల యజమానులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని కాష్ మహేష్ రెడ్డి తెలిపారు..
 
 
 
 






