
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19 నుండి 45 సంవత్సరాల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను 9573363141.







