ఆంధ్రప్రదేశ్
PHIRNGIPURAM..కుష్టు వ్యాధి రహిత దేశంగా మార్చడానికి సహకరించాలి
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వైద్య సిబ్బంది కుష్టు వ్యాధి అవగాహనా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి యానీగ్రేస్ మాట్లాడుతూ మన దేశాన్ని కుష్టు వ్యాధి రహిత దేశంగా మార్చటానికి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు కె. సుదర్శన్ రాజు, ANM, ఆశాలు పాల్గొన్నారు.