industry with Gokulas: గోకులాలతో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం:మంత్రి గొట్టిపాటి రవికుమార్
గోకులాలతో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహంబాపట్ల జిల్లాలోనే రూ.14.76 కోట్లతో 683 గోకులాల నిర్మాణంబాపట్ల, ప్రకాశం జిల్లాలలో పలు గోకులాలు ప్రారంభం
అమరావతి\అద్దంకి
గోకులాల నిర్మాణాలతో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా ఆంధ్రప్రదేశ్ లో పాడి పరిశ్రమ అభివ్రుద్ధి చెందుతుందని, రైతులకు ఆర్థిక చేయూత లభిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని గోవాడ గ్రామంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి.. నిర్మాణం పూర్తి చేసుకున్న పలు గోకులాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తరువాత పాడి పరిశ్రమపై ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే 12,500 గోకులాలను నిర్మించినట్లు మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కేవలం 260 గోకులాలను మాత్రమే నిర్మించిందని తెలిపిన మంత్రి… ఇటువంటి చర్యలతో పాడి పరిశ్రమ అభివ్రుద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. నిధులు దుర్వినియోగం తప్ప పాడి పరిశ్రమ అభివ్రుద్ధికి గత వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.స్థానిక సమస్యల పరిష్కారం…బాపట్ల జిల్లాలో శనివారం గోకులాలు ప్రారంభోత్సవంతో పాటు సీసీ రోడ్లు, డ్రైన్లు వంటి పలు అభివ్రుద్ధి పనులు ప్రారంభించి… మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను స్థానికులు కలిసి పలు అభ్యర్థనలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి.., ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందన్న మంత్రి గొట్టిపాటి… ఒక్కో గోకులాన్ని సుమారు రూ.2.30 లక్షలతో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ప్రోత్సాహానికి.. తద్వారా రైతుల ఆర్థిక అభివ్రుద్ధికి చేయూత నిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేత్రుత్వంలోని కూటమి ప్రభుత్వం… ఇటువంటి అనేక పథకాల ద్వారా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తుందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు నేతలతో పాటు అధికారులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు