
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల:-కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం ఆదర్శనగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

ఉదయం సరిగ్గా 10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి షేక్ అయినట్లు ప్రజలు భావిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన కంపనంతో స్థానికులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటన సమయంలో పాఠశాలల్లో ఉన్న చిన్నారులు కూడా తీవ్ర భయానికి లోనయ్యారు. తరగతుల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే బయటకు వచ్చారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిల్లలు, ఉపాధ్యాయులు భయంతో బయటకు రావడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.Hyderabad naampalli

ఇది భూకంప ప్రభావమా? లేక స్థానికంగా ఏదైనా ఇతర కారణంతో ఈ కంపనం ఏర్పడిందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై నిపుణులు, అధికారుల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉండగా, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.










