గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏటుకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్ హాల్‌లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో “సూపర్ సిక్స్ – సూపర్ హిట్ – స్త్రీ శక్తి” సభను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు, మహిళా శక్తి ఊరేగింపుగా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం పసుపు, జనసేన, కాషాయ పతాకాలతో అలరారనుంది. రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రముఖ ప్రజాప్రతినిధులు సభలో పాల్గొననున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మహిళా సాధికారత గురించి ఈ సభలో నేతలు ప్రసంగించనున్నారు. ఈ సభను ఘనవిజయం చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.
241 Less than a minute