
గుంటూరు, జనవరి 25:-గుంటూరులో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. జెండా వందనం, జిల్లా కలెక్టర్ ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం కార్యక్రమంలో భాగంగా ఉంటాయని వివరించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, తహసిల్దార్ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.guntur 3










