
అక్టోబర్ 17: స్వాతంత్ర్య పోరాటంలో తుపాకులు పట్టిన యోధులు ఉన్నారు. కానీ ఆయుధం లేకుండా వందలమందిని చైతన్యపరిచి, ఒక దేశాన్ని మేల్కొలిపిన మహానాయకుడు మాత్రం ఒక్కరు — మహాత్మా గాంధీ, మన జాతిపిత.చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాల్లో “గాంధీ తాతయ్య అహింసతో స్వాతంత్ర్యం సాధించారు” అనే వాక్యం తరచూ వినిపిస్తుంది. కానీ వయస్సుతో పాటు ఈ వాక్యానికి ఉన్న లోతు అర్థమవుతుంది — అది తాత్కాలిక విజయం కాదు, భవిష్యత్ నిర్మాణానికి వేసిన బలమైన పునాది.
రైలులోంచి దించివేత… తత్వం పుట్టిన రోజుదక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తున్న గాంధీ, ఒక రోజు చర్మం రంగు కారణంగా రైలులో నుంచి బయటకు నెట్టివేయబడ్డారు. ఆ సంఘటనపై ఆయనలో గల కోపం హింస మార్గం వైపుకు కాకుండా, సమాజాన్ని మారుస్తూ పోయే దిశగామలచబడింది.అక్కడే “సత్యాగ్రహం” అనే మార్గం ఆవిర్భవించింది. అహింసా సిద్ధాంతాన్ని ఆయనే మొదటగా ఒక జకీయ శక్తిగా మార్చారు.ఆయుధాలు కాదు… ఆలోచనలే శక్తి
ప్రపంచం హింసతో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లో, గాంధీ మాత్రం ప్రేమ, సత్యం, అహింస అనే మూల్యాల ద్వారా ప్రజలను ఉద్దీపన చేశారు.“హింసతో వచ్చిన స్వాతంత్ర్యం తాత్కాలికం. ప్రేమతో వచ్చిన స్వాతంత్ర్యం శాశ్వతం.” – ఇదే ఆయన నమ్మకం.భారత సంస్కృతిలో బుద్ధుడు, మహావీరుడు లాంటి అహింసా చిహ్నాలూ ఉన్న నేపథ్యం ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ దేశానికి అహింసే సరైన మార్గమని ఆయన నమ్మారు.సహాయ నిరాకరణ – కోపాన్ని అణిచిన దృఢ సంకల్పంసహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో కొంత హింస చోటు చేసుకుంది. వెంటనే ఉద్యమాన్ని నిలిపివేసిన గాంధీపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.కానీ ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం ఒక తాత్కాలిక లక్ష్యం కాదు. ఈ దేశ ప్రజలు ఎలాంటి విలువలపై బతకాలి? భవిష్యత్ భారతదేశం ఎలా ఉండాలి? అనే ప్రశ్నలకు ఆయన తత్వమే సమాధానమయ్యింది.రెండో ప్రపంచ యుద్ధం – నైతికతకు మద్దతుబ్రిటిష్ పాలకులు మన శత్రువులు కాబట్టి, వారి శత్రువైన జర్మనీ మిత్రుడని అనుకునే పరిస్థితుల్లోనూ గాంధీ తాతయ్య మాత్రం స్పష్టంగా ఒక విషయం చెప్పారు:“శత్రువు యొక్క శత్రువు మన మిత్రుడు కాదు. ధర్మం ఉన్నవాడే మన మిత్రుడు.”ఇది గాంధీ ఆలోచనా లోతుకు గొప్ప ఉదాహరణగా నిలిచింది.విభజన – వక్రీకరించిన వాస్తవందేశ విభజన సమయంలో జరిగిన హింస, వేరుపాటలు గాంధీ తాతయ్య తప్పేమీ కాదు. ఆయన చివరి వరకు దేశ ఏకత్వం కోసం పోరాడారు. కానీ రాజకీయ నాయకుల మొండితనమే విభజనకు దారితీసింది. అనంతరం ఆయనపై నిరాధారమైన విమర్శలు వచ్చినప్పటికీ, ప్రజల గుండెల్లో ఆయన నిజాయితీ స్పష్టంగా నిలిచిపోయింది.ఈ రోజు గాంధీని గుర్తుపెట్టుకోవాలంటే…సత్యం, అహింస, లౌకికత, ఐక్యత వంటి విలువలు — ఇవే గాంధీ తత్వం. ఇవి మన దేశ ప్రజాస్వామ్యానికి మూలాధారాలు. ఇవే నిజమైన జాతీయ సంపద.ఈ రోజు మనం ఆయుధాల గురించి కాదు, ఆలోచనల బలాన్ని గురించి మాట్లాడాలి. విభిన్నతలో ఏకత్వం అనే భావనను మిగిలిన ప్రపంచానికి చూపించాలంటే, గాంధీ చూపిన మార్గమే మన దారిగా ఉండాలి.







