

గంజాయి కలిగిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుండి 7 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో సీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ, రామాపురంలో రొయ్యల చెరువుల వద్ద గంజాయి కలిగి ఉన్నారని అనుమానంతో ఎస్సై పైడి బాబు సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వారిని అరెస్టు చేశామన్నారు. రొయ్యల చెరువు వద్ద పశ్చిమ బెంగాల్ కు చెందిన సోమనాథ్ విక్రం పనిచేస్తు, అక్కడినుండి గంజాయి తెచ్చి, అరెస్టు చేసిన ఐదుగురు ముద్దాయిలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. వేరే రాష్ట్రాల నుండి వచ్చి, రొయ్యల చెరువులపై పనిచేసే వారిని యజమానులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ముద్దాయిలను కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలో అక్రమ గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినందుకు ఎస్సై పైడి బాబుని సిబ్బందిని సీఐ అభినందించారు. గంజాయిని అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వాములై, పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు.







