
గన్నవరం, అక్టోబర్ 22:గన్నవరం మాజీ శాసనసభ్యులు డా. వల్లభనేని వంశీమోహన్ గారి జన్మదినోత్సవ వేడుకలు అంబాపురం గ్రామంలోని వైయస్ఆర్ బొమ్మ సెంటర్ వద్ద అంబాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లమోతు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోడాలి ప్రవీణ్, పలపాక మరియదాసు, పైడిముక్క రమేష్, తోడేటి కిరణ్ కుమార్, కొడాలి భారత్, మంచాల విజయ్, సొంగ దయాకర్, ప్రభాకర్, రవితేజ, సాయి తదితరులు పాల్గొన్నారు.







