
మచిలీపట్నం, జనవరి 25:– ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి ఎన్నికల అవార్డు లభించింది.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ‘ఉత్తమ జిల్లా కలెక్టర్’ అవార్డును స్వీకరించారు.
2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా మ్యాపింగ్ నిర్వహించినందుకు గాను ఈ అవార్డు దక్కింది.మచిలీపట్నంలో పోలీస్ శిక్షణ కేంద్రం శంకుస్థాపన||Police Training Center Groundbreaking in Machilipatnam
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి ఫలితంగానే ఈ గౌరవం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, పూర్వ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.










