
బాపట్ల, అక్టోబర్ 16:పెట్టుబడిదారుల భాగస్వామిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల భాగంగా బాపట్ల జిల్లాలో పరిశ్రమల ప్రేరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో గురువారం గోడపత్రాలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పెట్టుబడిదారుల సదస్సును పురస్కరించుకుని జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ సదస్సు ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యమని కలెక్టర్ వెల్లడించారు. పరిశ్రమల ఆధునికీకరణ, స్థిరీకరణ, పర్యావరణ అనుకూలత, పరిశుభ్రత, మొక్కలు నాటడం, ఓత్సాహిక పెట్టుబడిదారుల భాగస్వామ్యం వంటి అంశాలపై అక్టోబర్ 17 నుంచి నవంబర్ 15 వరకు జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు జరుగనున్నాయని వివరించారు.
కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి:అక్టోబర్ 17–21: పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలుఅక్టోబర్ 22–28: మొక్కలు నాటే కార్యక్రమాలుఅక్టోబర్ 29–నవంబర్ 5: ఓత్సాహిక పెట్టుబడిదారులతో పరిశ్రమల అభివృద్ధినవంబర్ 6–15: పరిశ్రమల ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనఈ కార్యక్రమాల నిర్వహణలో ఏపీఐఐసీ కీలక పాత్ర పోషిస్తుందని, జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారుఈ కార్యక్రమంలో డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్, ఏపీఐఐసీ గుంటూరు జోనల్ మేనేజర్ నరసింహారావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రామకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






