chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు : కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు, అక్టోబర్ 25 : జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

సమావేశంలో సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కే ఖాజావలి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాస మూర్తి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ, “జాతీయ రహదారుల ప్రక్కన వ్యర్థాలను డంపింగ్ చేయకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల కారణాలను గుర్తించి వాటి నివారణకు ఐఆర్ఏడీ యాప్‌ను వినియోగించాలి,” అని తెలిపారు. ఈ యాప్ ద్వారా రవాణా, పోలీస్, రహదారి మరియు వైద్య ఆరోగ్య శాఖలు ప్రమాదాల సమాచారం, తనిఖీ నివేదికలను నమోదు చేయాలని సూచించారు.

జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే 52 బ్లాక్ స్పాట్‌లు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వాటిలో 45 ప్రదేశాల్లో ఇప్పటికే రక్షణ చర్యలు తీసుకున్నట్లు, మిగిలిన ఏడు చోట్ల చేపడుతున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.

అంతేగాక, స్కూల్స్, హాస్పిటల్స్ ప్రాంతాల్లో, అలాగే బ్లాక్ స్పాట్‌ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేయాలని తెలిపారు. నగరంలోని మూడు వంతెనల వద్ద వర్షపు నీరు నిల్వ కాకుండా 20 హెచ్‌పి మోటార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వాహనాల అనాధికృత పార్కింగ్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదానికి గురైనవారికి తక్షణ చికిత్స అందించేలా ట్రామా కేర్ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్ఓకి సూచనలు ఇచ్చారు. “ఎన్ని ప్రమాద బాధితులు ఎన్టీఆర్ వైద్య సేవల కింద చికిత్స పొందుతున్నారు?” అంటూ వివరాలను తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో జాతీయ రహదారుల, వైద్య ఆరోగ్య, ఎక్సైజ్, నగరపాలక సంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker