బాపట్ల, సెప్టెంబర్ 13 :శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి ఆర్ డి ఓ లు, మండల తహశీల్దార్లు,యం పి డి ఓ లు,మండల వ్యవసాయ అధికారుల తో జిల్లాలో రైతులకు యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పకడ్బందీగా పంపిణీ జరగాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు చెప్పిన విదంగా మండల వ్యవసాయ అధికారులు సోమవారం నుండి ఆదివారం వరకు ఎంత యూరియా అవసరముందో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారులు గత సంవత్సరం లో జిల్లాలో ఈరోజు నాటికి ఎన్ని ఎకరాలలో పంటలు వేశారు,ఇప్పుడు ఎన్ని ఎకరాలలో పంటలు వేశారని నిర్దారణ చేసుకోవాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారులు యూరియా ఎంత వచ్చింది,ఎంత రైతు కేంద్రాలకు పంపించమని ప్రతి రోజు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.ఏ మండలం రైతులు వ్యవసాయం చేస్తుకుంటున్నరో ఆ మండలంలో నే రైతులకు యూరియా పంపిణీ చేయాల్సిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులదేనని చూచించారు. మండలంలో ఎన్ని ఎకరాలు పంటలు పెట్టారో అన్ని ఎకరాలకు మాత్రమే యూరియా పంపిణీ చేయాలని,మండలాలలో ఇప్పటి వరకు ఎంత యూరియా పంపిణి చేశారు, ఇంకా ఎంత అవసరము అవుతుందని అంచనాలు చేసుకోవాలన్నారు.ఏ మండలానికి ఎంత అవసరవుందో అంతేఇవ్వడం జరుగుతుందన్నారు.ఎరువుల కొరత, అధిక ధరలు ఉంటే కంట్రోల్ రూమ్ 82470 40131 నెంబర్ కు ఫోన్ చేసి పిర్యాదు లు చేసేలా రైతులకు అవగాహన కలిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతి యూరియా పంపిణీ కేంద్రం వద్ద గ్రామ వ్యవసాయ అధికారి వీఆర్వో లేదా వీఆర్ఏ, ఒక పోలీస్ అధికారి ఉండి రైతులకు ఎలా పంపిణీ జరుగుతుందని పరిశీలించాలన్నారు.రైతు కేంద్రం వద్ద ఉన్న వి ఆర్ ఓ/ వి ఆర్ ఏ, గ్రామ వ్యవసాయ అధికారి యూరియాకు వచ్చే రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు పెట్టారు వారికి ఎంత అవసరమవుతుందో వంటి వివరాలను తీసుకోవాలన్నారు. ఎవరికైనా ఎక్కువ ఇస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతిరోజు రైతు కేంద్రాలను పరిశీలించాలన్నారు. రైతు కేంద్రాలకు వచ్చే రైతులకు ముందుగానే టోకెన్లు ఇవ్వాలని,ఒక్క వేళా టొకన్లు ఇచ్చిన అందరికి ఉన్న యూరియా సలకపోతే టొకన్లు ఇచ్చిన వారికి ముందుగానే సమాచారం తెలియజేయాలని,అలాంటి వారికి మరుసటి రోజు వచ్చి తీసుకునేలా వారికి తెలియజేయాలన్నారు. ఎంత నిల్వవుందో అంతే ఇవ్వాలని ఎక్కువ యువరాదన్నారు. మండలాల వారిగా యూరియా సప్లై చేయడం జరుగుతుందని, ప్రతిరోజు మండల వ్యవసాయ అధికారులు తహశీల్దార్లు తో యూరియా పంపిణీ పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.రైతు కేంద్రాలలో సిబ్బంది తక్కువగా ఉంటే తక్కువగా ఉన్న చోటుకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.యూరియా పంపిణీ లో ఎలాంటి సమస్యలు వస్తాయని ముందుగానే గుర్తించి సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలని దానిపై దృష్టి సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు.యూరియా పంపిణీ లో ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. .
1,253 1 minute read