
Bapatla :-జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర్ గారు మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ మాట్లాడుతూ…
మొబైల్ ఫోన్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీసు యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిందన్నారు. సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, వివిధ ప్రాంతాల్లో ఉన్న చోరీకి గురైన సెల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.Bapatla Local News
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను త్వరలోనే సంబంధిత యజమానులకు అప్పగించనున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఎస్పీ ఉమామహేశ్వర్ గారు సూచించారు. జిల్లా పోలీసుల నిరంతర నిఘా, అప్రమత్తతతో ఇలాంటి కేసుల్లో మరింత పురోగతి సాధిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










