
విశాఖపట్నం, ఫిబ్రవరి 20:– ICAR-CMFRI విశాఖపట్నం రీజినల్ సెంటర్ బృందం గిరిజన సమాజాల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నీటి నిల్వలు, చెరువులు, రిజర్వాయర్లు వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది గిరిజనులు నమోదు చేసుకుని పాల్గొన్నారు. మత్స్య సంపద, ఆక్వాకల్చర్ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై నిపుణులు మార్గనిర్దేశం చేశారు.

సమావేశానికి సీఎంఎఫ్‌ఆర్‌ఐ అధిపతి డా. జో కే కిజ్హకుడన్, కార్యక్రమ సమన్వయకర్త డా. జయశ్రీ లోకా, శాస్త్రవేత్తలు డా. రితేష్ రంజన్, సీనియర్ శాస్త్రవేత్తలు డా. శేఖర్ మెగరాజన్, డా. రాజు బైతా పాల్గొన్నారు.

వారు గిరిజన ప్రాంతాల్లో చేపల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, సమూహ ఆధారిత ఆక్వాకల్చర్ నమూనాలు అమలు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయ వనరులు సృష్టించవచ్చని తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, సాంకేతిక సహకారం గురించి కూడా వివరించారు.Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer
ఈ కార్యక్రమం గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, నీటి వనరుల సంరక్షణతో పాటు స్థిరమైన మత్స్య ఉత్పత్తి పెంపునకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.







