
బాపట్ల:జనవరి:-సోమవారం మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిట్టా శ్రీనివాసరావును రాష్ట్ర నాటక కళా పరిషత్ కార్పొరేషన్ డైరెక్టర్ మందపాటి ఆంద్రేయ పరామర్శించారు. గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం బాపట్లకు చేరుకున్న జిట్టాను భీమావారి పాలెంలోని ఆయన నివాసంలో ఆంద్రేయ కలిశారు.
విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తిరిగి బాపట్లకు వస్తుండగా జిట్టా శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిసింది.TODAY BAPATLA NEWS
ఈ సందర్భంగా మందపాటి ఆంద్రేయ మాట్లాడుతూ, జిట్టా శ్రీనివాసరావు త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. పార్టీకి, ప్రజలకు ఆయన సేవలు మరింత అవసరమని పేర్కొన్నారు.










