Godarola’s 175 dishes for Alludu:గోదారోళ్ల ఆతిధ్యం…!అల్లుడికి 175 వంటకాల వడ్డీంపు:
గోదారోళ్ళు ఎక్కడున్నా గోదారోళ్ళే. వాళ్ళు ఏమి చేసినా వెరైటీగానే ఉంటుంది. వాళ్లు ఏ విషయంలోనూ రాజీపడరు. ఆతిథ్యంలో గోదారోళ్లకు మించిన వారు లేరు. వాళ్లు ఏ ప్రాంతంలో నివసిస్తున్న గోదారోళ్ల ఆతిథ్యం మానరు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ విజయనగరంలో నివాసం ఉంటున్న ఆ గోదారోళ్ళు పండగకి ఇంటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 175 వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తోట వెంకటేశ్వరరావు ఉమా దంపతులది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. వెంకటేశ్వరరావు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా వెంకటేశ్వరరావు దంపతులు విజయనగరంలోని తాడివాడలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె తోట ధరణి ని ఏడాది క్రితం ఏలూరు జిల్లా తణుకు కు చెందిన చిలకలపూడి సంతోష్ పృద్వికిచ్చి వివాహం చేశారు. ఆ కొత్త దంపతులకి ఈ ఏడాది సంక్రాంతి తొలి పండుగ కావడంతో చిలకలపూడి కుటుంబీకులను తోట కుటుంబీకులు పండగకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్నతాడేవాడ వచ్చిన అల్లునికి గోదారోళ్ల ఆతిథ్యం లభించింది. తమ సంప్రదాయం ప్రకారము తోట వెంకటేశ్వర్లు దంపతులు కొత్త అల్లుడికి 175 రకాల వంటలతో వడ్డన చేశారు. చిలకలపూడి సంతోష్ పృద్వి ఒక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గోదారోళ్ల ఆతిథ్యం చూసి వచ్చిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. 175 రకాల వంటకాలను చూసి అబ్బురపడ్డారు. వంటకాల రుచులతో విందారగించిన అతిథులంతా ఆహా ఏమి రుచి అని అనుకోకుండా ఉండలేకపోయారు. గోదారోళ్ళు ఎక్కడున్నా గోదారోళ్ళే నని అనలేకుండా ఉండలేకపోయారు. ఎంతైనా గోదారోళ్ళు గోదారోళ్లే!