
కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనం భారీ ఒప్పందం
ఐటీలో విశాఖ ఎదుగుతున్న తీరు రాష్ట్రానికే గర్వకారణం
చదువుకున్న యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు: జీవీ
విశాఖ కేంద్రంగా రూ.87,250 కోట్లతో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌తో రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని హర్షం వ్యక్తం చేశారు చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. గూగుల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖని తమ ఎంపికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోని వనరులకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామన్నారు. దీని ద్వారా బ్రాండ్ ఏపీకి పెట్టుబడిదారులే ప్రచారకర్తలన్న నినాదాన్ని సీఎం చంద్రబాబు మరోసారి నిజం చేసి చూపించారన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, యాక్సెంచర్, సిఫీ, సత్వా, డబ్ల్యూఎన్‌ఎస్ ఇలా ప్రముఖ సంస్థలన్నీఏర్పాటు చేయనున్న ఐటీ ప్రాంగణాలతో సాగరనగరం రూపురేఖలన్నీ మారబోతున్నాయని తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రికాప్రకటన విడుదల చేసిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు గూగుల్ డేటా సెంటర్ ద్వారా రాష్ట్రంలో కొత్త ఉద్యోగావకాశాలు, భారీ పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీతో వ్యాపార వాతావరణం ఏర్పడనుందని పేర్కొన్నారు. వినుకొండలో విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం 89వ అన్నదాన కార్యక్రమం||89th Annadanam Held by Retired Employees’ Service Association in Vinukonda
2029 నాటికి ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాల్సిన లక్ష్యంతో ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. గూగుల్ ఒప్పందం ద్వారా దేశ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఎఫ్‌డీఐ సాధించడం చంద్రబాబు, లోకేష్ శ్రమ, సమర్థత, నిబద్ధతకు తార్కాణంగా పేర్కొన్నారు. గూగుల్ సహా మిగిలిన సంస్థల డేటా సెంటర్లు, జీసీసీల ఏర్పాటుతో విశాఖ దేశంలోనే మొట్టమొదటి ఏఐ నగ రంగా కూడా రూపుదిద్దుకోనుందని ఐటీలో మేటిగా కావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నా రు. వినుకొండలో ప్రభుత్వ కళాశాలలో ఉర్దూ అధ్యాపకుని కోసం ముస్లిం సంఘం డిమాండ్||Muslim Leaders Seek Urdu Lecturer in Vinukonda Govt Colleges
దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే అని చాటిచెప్పగలుగు తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ నగరం, వీఎంఆర్డీఏ పరిధిలో రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులతో రానున్న రోజుల్లో మరిన్ని భారీ పెట్టుబడులు కూడా వస్తాయని విశ్వా సం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, రాయలసీమ ప్రాంతంలో రక్షణ, ఏరో స్పేస్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో 3ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందుతాయన్నారు. వీటన్నింటి ద్వారా ఎక్కడి యువతకు అక్కడే ఉపాధి లభిస్తుందని, ఉన్నత స్థాయి వేతనాలు, భవిష్యత్ కోసం సొంత రాష్ట్రం, దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.
 
 
 
  
 






