
విశాఖపట్నం:15 10-25:- 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడితో దేశవ్యాప్తంగా దృష్టులు విశాఖపట్నం వైపు తిప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.గూగుల్ పెట్టుబడిని ప్రతిబింబించేలా వైజాగ్ పేరులోని “G” స్థానంలో గూగుల్ లోగోను చేర్చిన ఒక స్పెషల్ పోస్టర్‌ను సీఎం ట్వీట్ చేశారు. సముద్రతీరాన్ని బ్యాక్‌డ్రాప్‌గా ఉంచి రూపొందించిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. “Vizag to Google” అన్న ఆకర్షణీయమైన కన్సెప్ట్‌తో విడుదలైన ఈ క్రియేటివ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.
గూగుల్ భారీ పెట్టుబడి తలపెట్టిన ఈ కీలక సమయంలో, విశాఖపట్నంకు చెందిన యువతకు, పారిశ్రామిక వేత్తలకు ఇది కొత్త ఆశాజ్యోతి అనిపిస్తోంది. రాష్ట్రానికి టెక్నాలజీ రంగంలో గౌరవం తీసుకువచ్చే ఈ డెవలప్‌మెంట్‌పై సీఎం చంద్రబాబు స్పందించిన విధానం ప్రశంసలందుకుంటోంది.







