

జాతీయ స్ధాయి అవార్డులను సాధించినసెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి , చీరాల అధ్యాపకుడు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల అధ్యాపకుడు డా|| టి గోపాల రావు జాతీయ స్ధాయి ఆవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తముగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆల్పా ఇంటర్‌నేషనల్ పబ్లికేషన్స్ , న్యూఢిల్లి సంస్ధ వారు ఇటీవల ప్రకటించిన జాతీయ స్ధాయి అవార్డులలో ను కళాశాల లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకుడు డా|| టి గోపాల రావు డిస్టింగిష్‌డ్ ఫ్రోఫెసర్ అవార్డు మరియు అకడిమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డు సాధించినట్లు కళాశాల ప్రిస్సిపాస్ డా|| కె. జగదీష్ బాబు తెలియజేశారు. ఇటీవల డా|| టి గోపాల రావుకు ఇంటర్‌నేషనల్ పబ్లికేషన్స్ , న్యూఢిల్లి సంస్ధ వారు ఈ అవార్డులను బహూకరించారు. డా|| టి గోపాల రావు డిస్టింగిష్‌డ్ ఫ్రోఫెసర్ అవార్డు మరియు అకడిమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డు సాధించిన సందర్భముగా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా|| లక్ష్మి తులసి చావలి, మొదటి సం|| ఇన్‌చార్జి యస్. అమరనాద్ బాబు, వివిధ అధ్యాపకులు, మరియు విద్యార్ధిని, విద్యార్ధులు అభినందనలు తెలియజేశారు.







