Singagudem : గోతులు పూడ్చేవారు ఏరి? సింగ గూడెం కొత్తపల్లి ప్రధాన రహదారి పై పెద్దపెద్ద గోతులు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెంలో సింగ గూడెం కొత్తపల్లి ప్రధాన రహదారి పై పెద్దపెద్ద గోతులు పడడంతో ప్రజలు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.రాత్రి సమయంలో ఎవరైనా ఆదమరస్తే ఇక అంతే సంగతులు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోడ్ల నిర్మాణం చేపట్టి అనేక చోట్ల కొత్త రోడ్లు, కొన్నిచోట్ల రోడ్లకు మరమ్మత్తులు జరిగిస్తుండగా సంబంధిత అధికారులకు మా సింగగూడెం ప్రధాన రహదారి కనబడటం లేదా అని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన ఇళ్లలో వాడిన నీరు రోడ్లపైకి వచ్చి రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలకు నెలవుగా మారింది.ప్రజలను వాహనదారులను ప్రమాదాల నుండి కాపాడాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.