గుంటూరు, అక్టోబర్ 8:ఈ దీపావళి shoppers కోసం సరికొత్త సేల్ అవకాశం! గుంటూరులో అక్టోబర్ 10, 11 తేదీలలో “జీఎస్టీ ఎగ్జిబిషన్ కం సేల్” నిర్వహించనున్నట్లు జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ఇ. శ్రీనివాసులు తెలిపారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నట్లు, ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు ఏ.సి. కాలేజీ అసెంబ్లీ హాల్, గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ సేల్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకతగా తగ్గించిన జీఎస్టీ రేట్లు, దీపావళి ఆఫర్లు, మరియు అతి తక్కువ ధరలు హైలైట్‌గా ఉండనున్నాయి.
ఈ సేల్‌లో లభించే ఉత్పత్తులు:
- చిన్నారుల కోసం పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్, గ్రాఫ్‌లు
- గృహోపయోగ వస్తువులు: టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు
- ఎలక్ట్రానిక్స్: సెల్‌ఫోన్లు
- వాహనాలు: స్కూటర్లు, బైక్స్, కార్లు
ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. దీపావళి కానుకలుగా బడ్జెట్ ధరలకు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇది మంచి వేదిక కావచ్చని అన్నారు.