
Krishna:పెడన:21-11-25:- పట్టణంలో రెల్లి సంఘం గుడి స్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్రమ ఆక్రమణలు, బెదిరింపులు చేస్తున్నారన్న ఆరోపణలతో రెల్లి సంఘం ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసింది.
కృష్ణా జిల్లాలోని పెడన పట్టణం, 18వ వార్డు—1982లో రెల్లి కులస్థుల కోసం కేటాయించిన గుడి స్థలం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. రెల్లి సంఘానికి చెందిన వారు అందించిన వివరాల ప్రకారం, పరసా వెంకటేశ్వరరావు, రంగారావు, పాపమ్మ, రమణయ్యలు ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు.
స్థానిక రెల్లి సంఘం అధ్యక్షుడు రామ్ బంగారు మాట్లాడుతూ“ఇదేమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా హక్కును తిరిగి పొందేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ గుడి స్థలాన్ని మాకు అప్పగించాలి” అని విజ్ఞప్తి చేశారు.ఈ పిర్యాదును ప్రజా దర్బార్లో అధికారులకు అందజేసిన సంఘం సభ్యులు, తమ సమస్యకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.







