
గుడివాడ: డిసెంబర్ 31:-కృష్ణా జిల్లా ఎస్పీ గారు, గుడివాడ డీఎస్పీ గారి ఆదేశాల మేరకు గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతి భద్రతలు మరియు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు కీలక ఆంక్షలు విధిస్తున్నట్లు గుడివాడ II టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జెఆర్కే హనీష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, అతివేగంగా డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను తక్షణమే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్లపై కేక్ కట్టింగ్స్, అల్లరి కార్యక్రమాలు, గుంపులుగా చేరి ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.Gudivada news ఈ విధమైన చర్యలకు పాల్పడితే ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా, బాధ్యతాయుతంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.







