

కృష్ణాజిల్లా:గుడివాడ నియోజి కవర్గ పరిధిలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 21 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఫండ్ 11 లక్షలచెక్కులను టిడిపి కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి వ్యవస్థను ఐదేళ్లుగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.పేద,మధ్య తరగతివర్గాల ఆరోగ్య సంరక్షణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, చాట్రగడ్డ రవికుమార్,గుడివాడ రూరల్ టిడిపిఅధ్యక్షులు వాసే మురళి, మజ్జాడి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.








