

కృష్ణాజిల్లా:గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే గేట్లపై ప్లే ఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసౌరి తెలిపారు. ఆరు నెలల్లో. ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఆర్ఓబి నిర్మాణ పనులను పేద కాలవ సెంటర్లో ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ అధికారులు ప్లే ఓవర్ నిర్మాణ పనులపురోగతిని వివరించారు ఎంపీ బాలసౌరి మీడియాతో మాట్లాడుతూ… గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 70% పూర్తయినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల నాణ్యతను ఎమ్మెల్యే రాము పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు.
అధికారులు తెలిపిన చిన్న పాటి సాంకేతిక సమస్యలు 15 రోజుల్లో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు.పార్లమెంట్ సభ్యుడిగా గుడివాడ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానని ఎంపీ బాలసౌరి పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్డు నిర్మాణానికి 20 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అవి త్వరలో ఆమోదం పొందనున్నట్లు ఎంపీ చెప్పారు.
గుడివాడ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఎంపీ బాలసౌరికి ప్రజల తరుపున ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఆయన శ్రమ ఫలితంగానే గుడివాడలో అనేక కేంద్ర ప్రాజెక్టులు మంజూర అయినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, నిమ్మగడ్డ సత్యసాయి, యార్లగడ్డ సుధారాణి, వేమూరి త్రినాథ్, సందు పవన్,ఎన్ హెచ్ డి.ఈ సత్యనారాయణ, AE శరత్ చంద్ర, వల్లభనేని కన్స్ట్రక్షన్ ఎండి వల్లభనేని వెంకటేశ్వరరావు,పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.








