

కృష్ణాజిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ లో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఘనంగా జరిగింది,ముఖ్య అతిథులుగా కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్,గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని తులసిచెట్టు మరియు కార్తీక దామోదరులకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి,వనసమారాధన వేడుకల ను ప్రారంభించారు. సభలో ఎమ్మెల్యే కామినేని మాట్లాడారు..70 ఏళ్ల క్రితమే గుడివాడ ఎంతో సుసంపన్నం గాఉండేదని,గుడివాడ మట్టిలో ఏదో శక్తి ఉండబట్టే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామోజీరావు లాంటి ఎందరో మహానుభావులు ఈ నెలపై జన్మించారన్నారు. సమాజంలోని ప్రతి కులంలో కొందరు చెడ్డవాళ్ళు ఉంటారని, ఒకరిద్దరు చేసే తప్పులను కులాలకు ఆపొదించకూడదని, ప్రతి ఒక్కరు సోదర భావంతో కలిసి ముందుకు సాగితేనే సమాజ ఉన్నతి సాధ్యమవుతుందన్నారు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… ఆత్మీయతలను చాటేలా వన సమారాధనలు నిర్వహించడం సంతోషకరమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు ఇతర వర్గాలను గౌరవించుకోవాలని, శక్తి కలిగిన వారు పేదలకు సహాయం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని. గెలిచిన తర్వాత ప్రజలందరికీ తాను ఎమ్మెల్యే నేనని, గుడివాడ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు,చేకూరు జగన్మోహనరావు,లింగం ప్రసాద్, పట్టణ ప్రముఖులు డాక్టర్ పాలడుగు వెంకట్రావు, ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్. వేములపల్లి కోదండరామయ్య, గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్, నిమ్మగడ్డ సత్యసాయి,కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు మన్నెం భవాని శంకర్, గౌరవ అధ్యక్షులు వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావు, కోశాధికారి రావి శ్రీనివాస్ చౌదరి, విద్యా కమిటీ చైర్మన్ బాబు శ్రీకర్, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి,సంఘీయులు పాల్గొన్నారు.








