

గుడివాడ మండలం దొండపాడు గ్రామం లో ‘రైతన్నా… మీకోసం’ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే రాము
దొండపాడు పరిసర గ్రామాల రైతులతో సమావేశమై… పంచ సూత్రాల ప్రయోజనాలు వివరించిన ఎమ్మెల్యే
దొండపాడు నవంబర్ 29: రాష్ట్రంలోని రైతన్నలకు మేలు చేసి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచ సూత్రాలను ప్రవేశపెట్టిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పంచ సూత్రాలపై గ్రామ గ్రామాన రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా… మీకోసం’ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో నిర్వహించారు. అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు… అనే పంచ సూత్రాలపై రైతులకు ఎమ్మెల్యే రాము రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు
“రైతన్న సేవలో – మన మంచి ప్రభుత్వం” ప్రచార పత్రికలను పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము రైతులను ఉద్దేశించి మాట్లాడారు….వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని గాలికొదిలేసి… రైతన్నను రోడ్డుపాలు చేసిందన్నారు.వైసీపీ ప్రభుత్వం రైతుకు చేయాల్సిన మేలు చేయకపోగా, వరుస వైఫల్యాలతో వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచసూత్రాల ద్వారా వ్యవసాయాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకెళ్తుందన్నారు.వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసి, రైతుకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలు అన్నదాతలు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రైతులకు 30 క్వింటాళ్ల మినుము విత్తనాలు ఎమ్మెల్యే రాము రైతుల ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ, శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, బ్యాంక్ చైర్మన్ ముసునూరి రాజేంద్రప్రసాద్, ముత్తినేని అమరబాబు, లింగంనేని వీర బసవయ్య, కుటుంబరావు, తుమ్మల రత్నాకర్ రావు, మెరుగుమాల శ్రీనివాసరావు, మాదాల సునీత, సూరపనేని బ్రహ్మం, ఖాకీ బాబూజీ, గుడివాడ శ్రీను, చోరపూడి బుజ్జిబాబు, MPDO విష్ణు ప్రసాద్, వ్యవసాయ శాఖ ADA కవిత, AO అనంతలక్ష్మి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ సౌజన్య, దొండపాడు పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.







