chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍బాపట్ల జిల్లా

chirala news :Guest lecture on ‘Software Engineering Beyond the Classroom’ at St. Ann’s College of Engineering and Technology.సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ‘సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బియాండ్ ది క్లాస్ రూమ్’పై గెస్ట్ లెక్చర్

వేటపాలెం, డిసెంబర్ 27:సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో “సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బియాండ్ ది క్లాస్ రూమ్” అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఎ.ఐ.ఎం.ఎల్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కే. సాంబ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Chirala Local News :చీరాల బాయ్స్ హై స్కూల్ ఆవరణలో ఘనంగా హిందూ సమ్మేళనం

ఈ గెస్ట్ లెక్చర్‌ను కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, తరగతి గదిలో పొందే సిద్ధాంత జ్ఞానంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ అవగాహన విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి గెస్ట్ లెక్చర్లు విద్యార్థుల కెరీర్‌కు దోహదపడతాయని అన్నారు.

ముఖ్య అతిథి కే. సాంబ విద్యార్థులతో మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్ రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతను వివరించి, రియల్ టైమ్ అప్లికేషన్లను క్లౌడ్‌లో ఎలా నిర్వహించాలి, స్కేలబిలిటీని ఎలా సాధించాలి అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. అలాగే ఏపీఐ కీస్ అవసరం, వివిధ అప్లికేషన్లతో అనుసంధానంలో వాటి పాత్ర, భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

మెషీన్ లెర్నింగ్ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, పరిశ్రమల్లో వాటి వినియోగం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై కూడా ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టుల అవసరానికి అనుగుణంగా సరైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. తరగతి గదిలో నేర్చుకునే సిద్ధాంత జ్ఞానానికి మించి, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో ఎలా ఎదగాలి, నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాలపై సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కే. సాంబ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ విషయాన్ని ఎ.ఐ.ఎం.ఎల్ విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్. హరికిషన్ తెలిపారు. ఈ గెస్ట్ లెక్చర్‌కు డాక్టర్ పి.ఎస్. నవీన్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఐ.ఎం.ఎల్ విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్. హరికిషన్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గెస్ట్ లెక్చర్‌ను విజయవంతం చేశారు.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio Men Men T Shirt
Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Product
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Product
Lymio Men Men T Shirt

Author

  • chirala news :Guest lecture on ‘Software Engineering Beyond the Classroom’ at St. Ann's College of Engineering and Technology.సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ‘సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బియాండ్ ది క్లాస్ రూమ్’పై గెస్ట్ లెక్చర్

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker