హైదరాబాద్ ;21-09-25:-నెక్లెస్ రోడ్ పైన ఉదయం వేళ గుండె ధడలు వేగంగా మెరుపులా పరుగెత్తాయి. అపోలో హాస్పిటల్ హైదర్‌గూడ మరియు కార్డియాక్ రిహాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్డియాక్ రన్ – ప్రజల్లో గుండె ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో జరిగింది.
2కె, 5కె, 10కె విభాగాల్లో నిర్వహించిన ఈ పరుగులో సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు పరుగులు పెట్టినవారి సంఖ్య దాదాపు రెండు వేల దాటింది.
వైద్యులు స్పష్టం చేస్తున్నారు – ఆహారపు అలవాట్లలో మార్పులు, నియమిత వ్యాయామం, మరియు ఒత్తిడి నియంత్రణ – ఇవన్నీ గుండెపోటు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించగలవని.
డాక్టర్ సుజాత హిల్డ (హెడ్, అపోలో హాస్పిటల్ హైదర్‌గూడ):
“ఇలాంటి కార్డియాక్ రన్స్ ద్వారా ప్రజల్లో చాలా మంచి అవగాహన వస్తోంది. గుండెపోటు అనేది శస్త్రచికిత్స తర్వాత మాత్రమే కాదు, ముందుగానే నివారించవచ్చు. కార్డియాక్ రిహాబ్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉంటే 90 శాతం గుండెపోటులను నివారించవచ్చు.”
డాక్టర్ మోహన్ వేమూరి (వైద్య నిపుణుడు):
“ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, తక్కువ వ్యాయామం, మరియు జంక్ ఫుడ్. సింపుల్ మార్పులతోనే దీన్ని నియంత్రించవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.”