GUNTUR…ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అనేది ఆధార్ నంబర్ వంటిది .. ఎస్పీ సతీష్ కుమార్
ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు, తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ ట్రాఫిక్ పోలీస్ నెంబరు కేటాయింపు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎస్పి సతీష్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ పోలీస్ నెంబర్ తీసుకోవాలంటే ఆటో ఓనర్ మరియు డ్రైవర్లు తమ వాహనం యొక్క పూర్తి వివరాలుతో పాటు తమ ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్ ను, పాస్పోర్ట్ సైజు ఫోటోలను పోలీసు వారికి అందించవలసి ఉంటుంది. ఆ వివరాలను పోలీసు వారు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన వెబ్సైట్లో పొందుపరిచి,ఆ వివరాలతో కూడిన ఒక క్యూఆర్ కోడ్ తో రూపొందించిన ప్రత్యేకమైన ట్రాఫిక్ పోలీస్ నెంబర్ కలిగిన స్టిక్కర్ ను ఆటోల డ్రైవర్లు/ ఓనర్లలకు అందించడం జరుగుతుంది అన్నారు. కావున గుంటూరు పట్టణ ఆటో డ్రైవర్లు మరియు ఓనర్లు ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి తమ వివరాలను అందించి ట్రాఫిక్ పోలీస్ నెంబరు పొందాలని, నేర నియంత్రణ మరియు ట్రాఫిక్ నియంత్రణ కొరకు పోలీసు తీసుకొని నిర్ణయాలకు మీ సహకారాన్ని అందించాలని ఎస్పీ తెలిపారు.