ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో బీసీ సంక్షేమ హాస్టల్ లో ఆహార కలుషితం వలన విద్యార్థులకు అనారోగ్యం సంభవించిందని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హుటాహుటిన వెళ్లారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించుటకు చర్యలు చేపట్టారు.
GUNTUR NEWS: ముఖ్యమంత్రి సహాయ నిధి..విద్యార్థులకు స్థానికంగానే అన్ని సదుపాయాలతో వైద్యం అందించుటకు ఏర్పాట్లు చేశారు. తాగునీటిని పరీక్షించాలని, పారిశుధ్యం, ఆహార పదార్థాలు అన్నిటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. తక్షణ అన్ని వైద్య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లను చేసి విద్యార్థులకు వైద్య చికిత్సలను అందిస్తున్నారు.