అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ సరుకులపై సుంకాన్ని 50%కు పెంచిన నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం గుంటూరు హిమని సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, టారిఫ్ పెంపు కారణంగా రాష్ట్ర ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, రొయ్యల ధరలు పడిపోవడంతో తీరప్రాంత రైతులు సంక్షోభంలో ఉన్నారని, వేలాది మహిళా కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిందని తెలిపారు. వీసా నిబంధనల కఠినతరం వల్ల విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఎం నాయకుడు దండ లక్ష్మీనారాయణ, సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు జిల్లా కార్యదర్శి పాటిబండ్ల కోటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ప్రసంగించారు. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
232 Less than a minute