గుంటూరుఆంధ్రప్రదేశ్

GUNTUR: అసంఘటిత కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు

LEGAL MEETING IN GUNTUR

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు క్యాలండర్ యాక్టివిటీస్ లో భాగంగా అసంఘటిత కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు అందరూ ఈ శ్రమ కార్డును కలిగి ఉండాలని తెలిపారు. ఈ శ్రమ కార్డు వలన అత్యవసర సమయం లో వైద్య , ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించబడి సహాయం పొందుతారని చెప్పారు . ఈ శ్రమ కార్డు ను ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకొని పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా వారికి అందే న్యాయ పరమైన సలహాలు సూచనలు అందించారు. ఈ శ్రమ కార్డుకు తాపీపని మేస్త్రీలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, ఆటో వర్కర్స్ డ్రైవర్స్, మెకానిక్స్ వీధి బండ్ల వ్యాపారస్థులు మొదలగువారు అర్హులు అని ఆయన వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker