ఘన వ్యర్ధాల నిర్వహణ పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టినప్పుడే రోజువారి ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పురపాలన సంచాలకులు (డిఎంఏ) హరి నారాయణన్ అన్నారు. గురువారం నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సూరజ్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎంఏ తొలుత జిందాల్ ప్రతినిదులతో ప్లాంట్ సామర్ధ్యం, అవసరమైన వ్యర్ధాలు, ఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకొని, అనంతరం ప్లాంట్ లోని ట్రిప్పింగ్ ఫ్లోర్, గ్రాప్ కంట్రోల్ రూమ్, బాయిలర్ 25 మీటర్, నెస్ట్ ట్రిప్పింగ్ ఫ్లోర్, బాయిలర్ 8 మీటర్, ఇన్సరేటర్, డిసిఎస్ కంట్రోల్ రూమ్, టిజి హాల్ లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో వ్యర్ధాల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందని, ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాలను ఒక చోట డంప్ చేయడం ద్వారా స్థలాభావ సమస్య కూడా ఎదురవుతుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా వ్యర్ధాల నిర్వహణ, అలాగే వ్యర్ధాల ద్వారా విద్యుత్ తయారీ ద్వారా వ్యర్ధాలకు సమర్దవంతమైన పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిందాల్ ప్రాజెక్ట్స్ ఏపి ప్రెసిడెంట్ ఎంవి.చారి, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ సతీష్ పాల్గొన్నారు.
135 1 minute read