
గుంటూరు అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పనిచేస్తున్నారని పలువురు టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో కార్పోరేటర్లు వేములపల్లి శ్రీరాం ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఆమె భర్త గల్లా రామచంద్రరావును కొందరు టార్గెట్ చేస్తున్నారు. ప్రజల మన్ననలు పొందిన వ్యాపార సంస్థ భ్రమరా టౌన్షిప్. డాక్టర్ రాఘవశర్మకు చెందిన 6 కోట్ల రూపాయల స్థలం కబ్జా చేశారంటూ మీడియాలో అసత్య కథనాలు ప్రచురించారు. పున్నారావు అనే వ్యక్తి నుండి గల్లా రామచంద్రరావు తోపాటు మరో ముగ్గురు కలిసి కొనుగోలు చేశారు. డాక్టర్ రాఘవశర్మ పేరుతో ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఎమ్మెల్యే గల్లా మాధవి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వారు స్పష్టం చేశారు.








