కూటమి నేతల అధిపత్య పోరుతో అత్యంత కీలకమైన ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర అభివృద్ది సంస్థ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్( మా-ఏపి) వ్యవస్థాపకులు సినీదర్శకుడు దిలీప్ రాజా ఆరోపించారు. గుంటూరులో ఒక ప్రైవేట్ అతిధి గృహంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ పదిసంవత్సరాలుగా ఒక్కసినిమా క్కూడా సబ్సిడి ఇవ్వకపోవడం దురద్రుష్టకరమన్నారు.GUNTUR NEWS జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ భార తీయుడు, ఒకేఒక్కడు,జoటిల్మన్ , బొంబాయి, ఖుషీ చిత్రాల నిర్మాత ఎ.ఎమ్.రత్నం పేరును ఎఫ్.డి.సి.చైర్మన్ పదవికి బహిరంగంగానే సిపారసు చేశారని ఆయన చెప్పారు. అయితే అప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి పదవి జనసేన ఖాతాలో ఉన్నoదువలన ఎఫ్.డి.సి. చైర్మన్ పదవిని అధికార పార్టీకి కేటాయించాలనే ఆలోచన ప్రచారo జరిగిందని ఆయన పేర్కొన్నారు.TO DAY NEWS BREKING ఈ నేపధ్యంలో ఆంధ్రాకు చెందిన’ క్షణక్షణం,సంతోషం, హలో బ్రదర్,రాఖీ’ చిత్రాల సీనియర్ నిర్మాత డాక్టర్ కె.ఎల్.నారాయణను నియమిoచవలసిoదిగా తెలుగుదేశం లోని కీలక నేత, ముఖ్యమంత్రి బంధువు కోరారని దిలీప్ రాజా వివరించారు. ఎవరిని నియమించినా ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధికి యుద్ధ ప్రతిపాదికన తగిన చర్యలు తీసుకునే డైనమిక్ నాయకుడు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టినిపెట్టి సమర్ధుడిని ఎఫ్.డి.సి. చైర్మన్ గా నియమిoచాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దిలీప్ రాజా కోరారు. మీడియా సదస్సులో నటులు ఎర్రబాబు పాల్గొన్నారు.
1,003 1 minute read