ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ రూ. 9 వేల రూపాయలు ఇవ్వాలని పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫెన్షనర్లు అందరికీ డిఏ వర్తింపజేసి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈమేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణనగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈపీఎస్ స్కీంను గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. అయితే 30 ఏళ్లు గడుస్తున్నా ఇంకా వెయ్యి మాత్రమే వస్తోందని చెప్పారు. హయ్యర్ పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కారం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు దుర్గారావు, శేషగిరిరావు, గంగాధరరావు, నికల్సన్ తదితరులు.
238 Less than a minute