పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై బురద జల్లేంందుకు వైసీపీ నేత అంబటి మురళీ ప్రయత్నం చేస్తున్నారని పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నేతలు తెలిపారు. పెదకాకాని ఎంపీపీ కుటుంబ సభ్యులు బోర్లు వేయించే విషయంలో అవినీతికి పాల్పడినది వాస్తవమని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎన్నడూ యాదవులకు మేలు చేయలేదని విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని వారు వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు తాళ్ల శ్రీనివాసరావు, దర్శి భాస్కరరావు, మైలా వెంకటరామరాజు,వలేటి మురళి కృష్ణ మీడియాతో మాట్లాడారు.
241 Less than a minute